ఇది వాడితే చక్కెర, బెల్లం అవసరముండదు

ఇది వాడితే చక్కెర, బెల్లం అవసరముండదు

స్వీట్స్ చేయాలంటే చక్కెర తప్పనిసరి. చక్కెర వద్దులే అనుకుంటే బెల్లం. కొన్ని కొన్ని స్పెషల్ ఐటమ్స్‌‌కి అయితే తేనె. ఇంకొంతమంది ఆర్టిఫీషియల్ షుగర్, మాపుల్ సిరప్​లు వాడతారు. వాటితోపాటు పాపులర్ షుగర్ ప్రొడక్ట్ మరొకటి ఉంది. దాని పేరు అగేవ్ నెక్టార్. దీన్ని అగేవ్ సిరప్ అని కూడా అంటారు. దీన్ని ఎక్కువగా టెక్విలా(ఆల్కహాల్​) ప్రొడక్షన్​లో వాడతారు.

బ్లూ అగేవ్ అనేది ఎడారి మొక్క. దీన్ని సైంటిఫిక్​గా అగేవ్ టకీలానా అంటారు. ఇది అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతుంది. టకీలా అనే ఆల్కహాల్ ప్రొడక్ట్, అగేవ్ సిరప్​లు దీన్నుంచి తయారుచేసినవే. మెక్సికోలో దీన్ని  చాలా ఏండ్ల నుంచి వాడుతున్నారు. దీనివల్ల మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయని వాళ్లు నమ్ముతారు. నిజానికి ఇందులో ఫ్రక్టేన్స్​ అనే గుడ్​ ఫైబర్​ ఉంటుంది. అది మెటబాలిజం, ఇన్సులిన్​ను మేనేజ్​ చేస్తుంది. ఆరోగ్యానికి మంచిదే. కానీ, కమర్షియల్​గా తయారుచేసే పద్ధతిలో హెల్త్​కు మంచి చేసే పదార్థాలన్నీ పోతాయి. అదెలాగంటే అగేవ్ మొక్క నుంచి తీసిన గుజ్జును ఉడికించి ‘మియెల్ డె అగేవ్’ అనే స్వీట్​నర్​ను తయారుచేస్తారు. ఉడికించడం వల్ల దానిలో ఉన్న మెడికల్ వ్యాల్యూస్​ పోతాయి. అలాగే టెక్విలాలో చాలాకాలం పులియబెట్టిన అగేవ్ షుగర్​ వాడతారు. అగేవ్​లో మెజ్కెల్ (అగేవ్ అమెరికానా) అనే రకం కూడా ఉంది. దీన్నుంచి కూడా చక్కెర ప్రొడ్యూస్ చేస్తారు. అంతేకాదు, అగేవ్ ఫ్లవర్స్​తో చేసిన సలాడ్, శ్నాక్స్​ మెక్సికోలో ఫేమస్. అగేవ్ మొక్కని షో ప్లాంట్​గా ఇళ్లలో పెంచుకుంటారు.

వాడొద్దు!
ఇందులో ఎక్కువ ఫ్రక్టోస్ ఉంటుంది. అందువల్ల ఎక్కువగా తింటే ఫ్రక్టోజ్ కాస్తా ఫ్యాట్​గా మారుతుంది. దానివల్ల లివర్ ఫంక్షన్​ మీద ఎఫెక్ట్ పడుతుంది. దాంతోపాటు హార్ట్ ప్రాబ్లమ్స్, లాంగ్​ టర్మ్ టైప్​2 డయాబెటిస్​ వచ్చే ప్రమాదముంది. అందుకని దీన్ని ఎక్కువగా వాడకపోవడమే మంచిది అంటున్నారు ఎక్స్​పర్ట్స్​.