రెండోరోజుకే ఇంత దారుణమా.. ఏజెంట్ ఎపిక్ డిజాస్టర్?

రెండోరోజుకే ఇంత దారుణమా.. ఏజెంట్ ఎపిక్ డిజాస్టర్?

ఏజెంట్(Agent).. అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surendar reddy) తెరకెక్కించిన ఈ మూవీ.. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో మినిమమ్ ఓపెనింగ్స్ ని కూడా దక్కించుకోలేకపోయింది ఈ మూవీ.

రిలీజైన మొదటి షో నుండే నెగిటీవ్ టాక్ తెచ్చుకోవడంతో సెకండ్ డే కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏజెంట్ మూవీ రెండోరోజు కేవలం 67 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. మరీ ముఖ్యంగా నైజంలో ఈ మూవీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ రెండోరోజు కేవలం 21 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది.

దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో.. చాలా థియేటర్స్ నుండి ఈ సినిమాని తీసేసె పరిస్థితి. ఆ ప్లేస్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష మూవీని ప్రదర్శిస్తున్నారు. అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా ఇలా అనూహ్యంగా డిజాస్టర్ రిజల్ట్ తెచ్చుకోవడం తట్టుకోలేకపోతున్నారు. చాలా రోజుల నుండి ఓ మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ.. రిజల్ట్ తారుమారయ్యింది. మరి తరువాత సినిమాతో ఐన అఖిల్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.