
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్’. సాక్షి వైద్య హీరోయిన్. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్2 సినిమా బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 28న విడుదలవుతోంది. ఏప్రిల్ 18న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను కాకినాడలో నిర్వహించనున్నట్టు తెలియజేశారు మేకర్స్. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అఖిల్ మాట్లాడుతూ ‘ఈ మూవీ నాకు మోస్ట్ మెమరబుల్ జర్నీ. మెంటల్‌గా ఫిజికల్‌గా నా జీవితాన్ని మార్చిన చిత్రమిది. నేను కొత్తగా కనిపిస్తున్నానంటే కారణం సురేందర్ రెడ్డి. ‘ఏజెంట్’ జర్నీ చాలా తృప్తిని ఇచ్చింది. మానసికంగా బలాన్ని ఇచ్చింది.
సాక్షికి ఈ సినిమాతో మరెన్నో అవకాశాలు వస్తాయి. మమ్ముట్టి గారు నా ఇన్‌స్పిరేషన్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయనతో స్క్రీన్ పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నా. నా క్యారెక్టర్ వైల్డ్‌గా ఉంటుంది. ఫైనల్‌గా ఇదొక హై ఆక్టేన్ రోలర్ కోస్టర్ రైడ్. ఈ క్రేజీ నెస్‌కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు’ అన్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో పార్ట్ అయినందుకు హ్యాపీగా ఉందని చెప్పింది సాక్షి వైద్య. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ‘ఈ సినిమాకోసం అఖిల్ బాగా కష్టపడ్డాడు. ఏడాదిన్నర పాటు బాడీ మెంటైన్ చేయడం అంత తేలిక కాదు. ఒక్క రోజు కూడా అలసట చెందలేదు. చాలా డెడికేటెడ్‌గా చేశాడు. అఖిల్ ఇప్పటివరకూ చేసింది ఒకెత్తు అయితే.. ‘ఏజెంట్’ మరో ఎత్తు’ అని చెప్పాడు. ప్రేక్షకుల అంచనాలు ‘ఏజెంట్’ అందుకుంటాడు అన్నారు నిర్మాత అనిల్ సుంకర.