ఏజెంట్ మూవీ పబ్లిక్ టాక్ .. ఆడియన్స్ ఏం అంటున్నారంటే

ఏజెంట్ మూవీ పబ్లిక్ టాక్ .. ఆడియన్స్ ఏం అంటున్నారంటే

అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఏజెంట్. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో  వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28 శుక్రవారం రోజున  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీపై అఖిల్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా కోసం అతను కూడా చాలానే కష్టపడ్డాడు. తన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ ఐతే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.అందుకే ఈ సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇన్ని అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుండి మిక్సుడ్ రెస్పాన్స్ వస్తోంది.

ఇప్పటికే అమెరికాలో ఏజెంట్ మూవీ  ప్రీమియర్ షోలు పడిపోయాయి. అలాగే ఇవాళ కొన్నిచోట్ల మార్నింగ్ షోస్ కంప్లీట్ అయ్యాయి. వస్తోన్న  టాక్ ని బట్టి చూస్తే.. ఏజెంట్ సినిమాకు పూర్తిగా నెగ‌టివ్ టాక్ వినిపోస్తుంది.  సినిమా ఏ మాత్రం అంచ‌నాలు అందుకోలేద‌ని, క‌థ‌, క‌థనాలు మరీ ఫేలవంగా ఉన్నాయని, సురేంద‌ర్‌రెడ్డి సినిమా ఖ‌ర్చుపై పెట్టిన శ్రద్దలో సగమైనా క‌థ‌, క‌థ‌నాల‌పై పెట్టుంటే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్.

ఇక సినిమా కోసం అఖిల్‌ చేసిన హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అని, అస‌లు పాట‌లు, నేప‌థ్య సంగీతం కూడా అస్సలు బాగోలేద‌ని, ఫ‌స్టాఫ్‌, సెకండాఫ్ అని తేడా లేకుండా సినిమా బాల్చిత‌న్నేసిన‌ట్టే చెప్పుకుంటున్నారు. అసలు ఇంత నాసిరకం కథని అఖిల్ ఎలా ఓకే చేశాడని, దానిపై 80 కోట్లు ఖర్చుపెట్టడం ఏంటని వాపోతున్నారు. ఇక మళయాళ నటుడు మమ్ముట్టి, హీరోయిన్ సాక్షి వైద్య పాత్రలు కూడా అంతలా ఆకట్టుకోలేదనే కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ సినిమా అఖిల్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా మిగిలిపోవడం ఖాయమని చెప్పుకుంటున్నారు.