ఏజీఐ గ్లాస్‌‌పాక్ ప్లాంట్‌‌లో జర్మన్ టెక్నాలజీ

ఏజీఐ గ్లాస్‌‌పాక్ ప్లాంట్‌‌లో జర్మన్ టెక్నాలజీ

కంటైనర్ గ్లాస్‌‌లను తయారు చేసే ఏజీఐ గ్లాస్‌‌పాక్‌‌  జర్మనీ కంపెనీ హార్న్‌‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా సరికొత్త జర్మన్‌‌ టెక్నాలజీతో భువనగిరిలోని ప్లాంట్‌‌లో ఓ ఫర్నేస్‌‌ను కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఈ టెక్నాలజీ ఖర్చు రూ. 55 కోట్లని ఏజీఐ గ్లాస్‌‌పాక్‌‌ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. పేరెంట్ కంపెనీ హెచ్‌‌ఎస్‌‌ఐఎల్‌‌  నుంచి రూ. 220 కోట్లను  తాజాగా కంపెనీ సమీకరించిన విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ ఖర్చులు కూడా ఈ అమౌంట్‌‌లోనే కలిసుంటాయి. తాజా ఫర్నేస్‌‌ వలన భువనగిరి ప్లాంట్‌‌లో రోజుకి 154 టన్నుల ప్రీమియం ఫ్లింట్‌‌, ఇతర రంగుల్లోని గ్లాస్‌‌లను తయారు చేయడానికి ఏజీఐ గ్లాస్‌‌పాక్‌‌కు వీలుంటుంది. తమ ప్లాంట్లను మరింత బలపరుచుకోవడంలో భాగంగా జర్మన్‌‌ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేశామని ఏజీఐ గ్లాస్‌‌పాక్‌‌ సీఈఓ రాజేష్‌‌ ఖోస్లా అన్నారు.