హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాల సాధనకు అగ్రి వర్సిటీ అభివృద్ధికి రూ.1500 కోట్ల నిధులు అవసరమని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగ అభివృద్ధిలో వర్సిటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఏఐ ఆధారిత పరిశోధనలు, మానవ రహిత వ్యవసాయం కోసం కొత్త ప్లాన్ రూపొందించామని చెప్పారు.
ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జీ. చిన్నారెడ్డి మాట్లాడుతూ అగ్రి వర్సిటీ దేశంలోనే నంబర్ వన్‌గా నిలవాలని ఆకాంక్షించారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ వర్సిటీ అభివృద్ధి చేసిన వంగడాలను రైతులకు చేరవేయాలని సూచించారు. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఆహార భద్రతలో స్వయం సమృద్ధి సాధించేలా కొత్త టెక్నాలజీలు, వంగడాలను రైతులకు అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు.
