ఉత్సాహంగా అంధ విద్యార్థుల పీస్ వాక్

ఉత్సాహంగా అంధ విద్యార్థుల పీస్ వాక్

పద్మారావునగర్, వెలుగు: సమాజంలో శాంతి, కరుణ భావాలను పెంపొందించడమే లక్ష్యంగా అహింసా అలయన్స్ ఆధ్వర్యంలో శనివారం భారీ శాంతి యాత్ర నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి మారేడ్​పల్లిలోని మహేంద్ర హిల్స్​లోని బుద్ధవిహార్ వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ఈ పీస్ వాక్ కొనసాగింది.

అహింసా అలయన్స్ వ్యవస్థాపకుడు సంతోష్ పుల్లూరి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవనారి పాఠశాలకు చెందిన 200 మంది అంధ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం బుద్ధవిహార్ వద్ద ప్రత్యేక ప్రార్థనలతో ఈ యాత్ర ముగిసింది.