మనం బండ్లలో కొట్టించే పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతున్నారని అందరికీ తెలుసు. కానీ, అసలు ఈ 'బయోఫ్యూయెల్' ఇథనాల్‌ను దేనితో తయారు చేస్తారు? ఫ్యాక్టరీల్లో దీన్ని ఎలా రెడీ చేస్తారు? అనే సీక్రెట్ ప్రాసెస్ చాలామందికి తెలియదు. మొక్కల నుంచి తీసే స్టార్చ్, షుగర్స్ సాయంతో.. ఒక పక్కా ప్లాన్ ప్రకారం 5 క్రేజీ స్టెప్స్‌లో ఈ ఇథనాల్‌ను తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అసలు ఇథనాల్ దేని నుంచి వస్తుంది?
ఇథనాల్ తయారు చేయడానికి బేసిక్ రా మెటీరియల్స్ ఏంటో తెలుసా? మన పొలాల్లో పండే మొక్కజొన్న, చెరకు. ఇవే కాకుండా పిండిపదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే వేరే మొక్కలను కూడా ఇథనాల్ తయారీ కోసం వాడుతుంటారు.
ఇథనాల్ తయారీ వెనుక ఉన్న ఆ 5 క్రేజీ స్టెప్స్:
1. మిల్లింగ్ & క్రషింగ్:
ముందుగా ఫ్యాక్టరీకి వచ్చిన మొక్కజొన్న గింజలను మిషన్లలో వేసి పిండిలా గ్రైండ్ చేస్తారు. అదే చెరకు అయితే.. దాన్ని బాగా క్రష్ చేసి అందులో ఉండే నాచురల్ జ్యూస్‌ను బయటకు తీస్తారు.
2. లిక్విఫాక్షన్ & స్టార్చ్ బ్రేకింగ్:
ఇప్పుడు ఆ మొక్కజొన్న పిండికి నీటిని కలిపి ఒక మిశ్రమంలా మారుస్తారు. దీనికి కొన్ని ప్రత్యేకమైన ఎంజైమ్స్ కలిపి బాగా హీట్ చేస్తారు. ఈ హీట్ వల్ల మొక్కల్లో ఉండే కాంప్లెక్స్ స్టార్చ్ కాస్తా.. ఈజీగా కరిగే గ్లూకోజ్ షుగర్ లాగా మారిపోతుంది.
3. ఫెర్మెంటేషన్:
ఇది అసలైన కెమిస్ట్రీ మ్యాజిక్. ఆ షుగర్ మిశ్రమానికి ఈస్ట్ అనే సూక్ష్మజీవులను యాడ్ చేస్తారు. ఈ ఈస్ట్ 40 నుంచి 72 గంటల పాటు ఆ చక్కెరను మొత్తం ఆరగించేసి.. దాన్ని ఇథనాల్, కార్బన్ డై ఆక్సైడ్‌గా మార్చేస్తుంది. ఈ ప్రాసెస్ తర్వాత వచ్చే లిక్విడ్‌ను బీర్ అంటారు. ఇందులో దాదాపు 10% నుండి 18% వరకు ఆల్కహాల్ ఉంటుంది.
►ALSO READ | మే నెలలో టోకు ద్రవ్యోల్బణం 9.68%.. ఇంధన రంగంలో ఏకంగా 30% అప్
4. డిస్టిలేషన్:
ఇప్పుడు ఆ లిక్విడ్‌ను పెద్ద పెద్ద డిస్టిలేషన్ కాలమ్స్‌లో వేసి మరిగిస్తారు. నీటి కంటే ఆల్కహాల్ తక్కువ టెంపరేచర్ వద్దే ఆవిరి అయిపోతుంది కాబట్టి.. ఇథనాల్ ఆవిరిగా మారి పైకి లేస్తుంది. దాన్ని మళ్లీ కూల్ చేసి లిక్విడ్‌గా మారుస్తారు. ఈ స్టెప్ తర్వాత ఇథనాల్ 95% ప్యూర్ అవుతుంది.
5. డీహైడ్రేషన్:
బండ్లలో వాడే ఫ్యూయెల్‌లో అస్సలు నీటి చుక్క ఉండకూడదు. అందుకే ఈ 95% ప్యూర్ ఇథనాల్‌ను 'మాలిక్యులర్ సీవ్' (మైక్రోస్కోపిక్ హోల్స్ ఉండే స్పెషల్ గ్రాన్యూల్స్) గుండా పంపిస్తారు. ఇది అందులో ఉన్న మిగిలిన 5% నీటిని కూడా గుంజేసి.. 99%+ ప్యూర్, వాటర్-ఫ్రీ ఇథనాల్ వస్తుంది.
ఇలా తయారైన ప్యూర్ ఇథనాల్‌ను ఎవరైనా తాగేసే ప్రమాదం ఉంది కాబట్టి.. దీన్ని మార్కెట్లోకి పంపే ముందు ఇందులో కొద్దిగా పెట్రోల్ వంటి టాక్సిక్ పదార్థాలను కలుపుతారు. దీన్నే డీనేచరింగ్ అంటారు. దీనివల్ల అది తాగడానికి పనికిరాకుండా పోతుంది. ఆ తర్వాతే దీన్ని పెట్రోల్‌లో బ్లెండింగ్ చేయడానికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇదన్నమాట మన బైక్ ట్యాంక్‌లోకి వచ్చే ఇథనాల్ తయారీ వెనుక ఉన్న అసలు స్టోరీ.
