యుద్ధం ఆగింది పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తారా? లేదా?.. కేంద్ర మంత్రి షాకింగ్ రిప్లై..

యుద్ధం ఆగింది పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తారా? లేదా?.. కేంద్ర మంత్రి షాకింగ్ రిప్లై..

పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ సిలిండర్ ధరల సెగతో అల్లాడిపోతున్న సామాన్యుడికి కేంద్రం నుంచి ఒక అప్‌డేట్ వచ్చింది. అంతర్జాతీయంగా మండుతున్న ముడిచమురు ధరల నేపథ్యంలో.. దేశీయంగా ఇంధన ధరల తగ్గింపు ఎప్పుడుంటుందనే ప్రశ్నపై కేంద్ర చమురు, సహజ వాయువు సహాయ మంత్రి సురేష్ గోపి ఆదివారం ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

క్రూడాయిల్ సప్లైని బట్టే రేట్లు..
పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా? లేదా? అని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సురేష్ గోపి క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చారు. ముందు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ సరఫరా ఎలా ఉందో చూడనివ్వండి. మనకు కేబినెట్ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఉన్నారు.. ఆ వివరాలన్నీ రానివ్వండి, చూద్దాం అంటూ అసలు నిర్ణయం పెట్రోలియం మంత్రిత్వ శాఖ చేతుల్లోనే ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఇదే క్రమంలో ధరలపై పదే పదే ప్రశ్నించిన మీడియాపై ఆయన కాస్త ఘాటుగానే స్పందిస్తూ.. ప్రభుత్వ నిర్ణయాలపై మీడియాకు పర్యవేక్షణ పాత్ర ఏమైనా ఉందా? అంటూ ఎదురుప్రశ్న వేశారు. సో క్రూడ్ ధరలను బట్టే రేట్ల రివిజన్ ఉంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.

ధరల మంటకు కారణం ఆ 'యుద్ధమే'
గత కొన్ని వారాలుగా దేశంలో ఇంధన ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రేట్ల పెంపునకు అసలు విలన్ పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధమే. ఈ భౌగోళిక ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్, నేచురల్ గ్యాస్ సప్లై చైన్ దారుణంగా దెబ్బతింది. మన దేశం తన చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతుల పైనే ఆధారపడుతుంది కాబట్టి.. అంతర్జాతీయ మార్కెట్లో చిన్న అలజడి వచ్చినా ఆ ప్రభావం నేరుగా మన జేబులపై పడుతోంది.

తగ్గింపు ఎప్పుడు? కేంద్రం ప్లాన్ ఏంటి?
ప్రస్తుతానికైతే రేట్లు ఎప్పుడు తగ్గుతాయి? లేదా ఎప్పుడు సమీక్షిస్తారనే దానికి ప్రభుత్వం ఎలాంటి టైమ్‌లైన్ పెట్టలేదు. గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకులు, దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సామాన్యుడిపై పడే భారం.. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ పెట్రోలియం శాఖ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయంగా సప్లై స్థిరపడే వరకు ధరల విషయంలో కేంద్రం వేచి చూసే ధోరణినే అవలంబించనుంది. సో బాస్.. క్రూడాయిల్ సప్లై లైన్ క్లియర్ అయ్యే వరకు పెట్రోల్ భారం భరించక తప్పేలా లేదు.