కరీంనగర్ జిల్లాలో కన్నీళ్లు తెప్పించే ఘటన: తండ్రి మృతిని తట్టుకోలేక యాసిడ్ తాగి కూతురు ఆత్మహత్యాయత్నం

కరీంనగర్ జిల్లాలో కన్నీళ్లు తెప్పించే ఘటన: తండ్రి మృతిని తట్టుకోలేక యాసిడ్ తాగి కూతురు ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: తండ్రి మృతిని తట్టుకోలేక కూతురు యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన గుజేట్టి శ్రీనివాస్ 2026, జూన్ 13న వడదెబ్బతో మృతి చెందాడు. 

తండ్రి మృతిని జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన కుమార్తె గుజేట్టి ఊహశ్రీ సోమవారం (జూన్ 15) ఇంట్లో ఉన్న యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తల్లి కళావతి, బంధువులు వెంటనే ఊహశ్రీని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రెఫర్ చేశారు వైద్యులు.

 ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో ఊహశ్రీ చికిత్స పొందుతోంది. ఊహశ్రీ కరీంనగర్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి చనిపోయిన రెండు రోజులకే కూతురు ఆత్మహత్యయత్నానికి పాల్పడటంతో బాధిత కుటుంబ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.