త్వరలో టీ కాంగ్రెస్‭లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి: నదీం జావేద్

త్వరలో టీ కాంగ్రెస్‭లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి: నదీం జావేద్

రానున్న ఎన్నికల్లో కేసీఆర్, బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతామని ఏఐసీసీ సెక్రటరీ నదీం జావెద్ అన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే ఇలాంటి భేదాభిప్రాయాలు ఉంటాయని చెప్పారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో చాలా సీనియర్ లీడర్ అని ఆయన అన్నారు. వెంకట్ రెడ్డికి అధిష్ఠానం షోకాజ్ నోటీస్ ఇచ్చిందని..  దానికి ఆయన సమాధానం ఇచ్చారని తెలిపారు. ఇక వెంకట్ రెడ్డి విషయం పార్టీ చూసుకుంటుందని నదీం జావెద్ స్పష్టం చేశారు. 

పార్టీ పదవుల విషయంలో కొందరికి అసంతృప్తి ఉంటుంది.. అది వాస్తవమేనని నదీం జావెద్ అంగీకరించారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సింది కాదన్నారు. ఏమైనా ఇబ్బంది ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడొచ్చని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏఐసీసీ దృష్టికి వెళ్లాయని తెలిపారు. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని నదీం జావెద్ వెల్లడించారు.