కొత్త విద్యా సంవత్సరం ప్రకటించిన ఏఐసీటీఈ

కొత్త విద్యా సంవత్సరం ప్రకటించిన ఏఐసీటీఈ

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి.. సవరించిన విద్యా క్యాలెండర్‌ను జూలై 8న విడుదల చేసింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పాత క్యాలెండర్ ను మార్పు చేస్తూ కొత్త క్యాలెండర్ ను విడుదల చేసింది. కొత్త క్యాలెండర్ ప్రకారం.. ఇప్పటికే కంటిన్యూ అవుతున్న విద్యార్థులకు తరగతులు ఆగస్టు 17 నుండి ప్రారంభం కానున్నాయి. అయితే కొత్తగా చేరే విద్యార్థులకు మాత్రం తరగతులు అక్టోబర్ 15 నుండి ప్రారంభమవుతాయి.

కరోనా వ్యాప్తి కారణంగా పరీక్షలు మరియు అకాడెమిక్ క్యాలెండర్‌కు సంబంధించి యూజిసీ మార్గదర్శకాల ప్రకారం సవరించిన క్యాలెండర్‌ను విడుదల చేసినట్లు ఏఐసీటీఈ తెలిపింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున HRD మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ యూజీసీ మార్గదర్శకాలను సవరించాలని జనవరి 24న కోరారు.

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జూలై 6న కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఏఐసీటీఈ ఆమోదించిన కాలేజీలు, విశ్వవిద్యాలయాలన్నీ యూజీసీ నియమాలను పాటించాలని కోరింది. కొత్త క్యాలెండర్ ప్రకారం.. పాత విద్యార్థులకు ఆగష్టు 17 నుంచి.. కొత్తగా చేరే విద్యార్థులకు అక్టోబర్ 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ మేనేజ్‌మెంట్ (పీజీసీఎం) కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ ఆగస్టు 17 లోగా పూర్తిచేయాలని యూజీసీ సూచించింది.

సీట్ల కేటాయింపు కోసం మొదటి విడత కౌన్సెలింగ్ అక్టోబర్ 5 లోగా, రెండో విడత కౌన్సెలింగ్ అక్టోబర్ 15 లోగా పూర్తి చేయాలని ఏఐసీటీఈ విద్యాసంస్థలకు సూచించింది. కొత్తగా చేరే విద్యార్థులు అక్టోబర్ 20వ తేదీలోగా కాలేజీలలో రిపోర్టు చేయాలని తెలిపింది.

For More News..

ప్రధానిని టార్గెట్ చేయాలంటే ఎంతసేపు?