ఎయిరిండియా భారీగా ఉద్యోగ నియామకాలు

ఎయిరిండియా భారీగా ఉద్యోగ నియామకాలు

బడా కంపెనీలన్నీ ఉద్యోగుల్ని తొలగిస్తూ పోతుంటే భారత కంపెనీ ఎయిరిండియా మాత్రం శుభవార్త చెప్పింది. టాటా గ్రూప్.. ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను కొనుగోలు చేసిన తర్వాత సేవలను భారీగా విస్తరించే పనిలో పడింది. తాజాగా 470 విమానాల కొనుగోలుకు ఎయిర్‌‌బస్‌, బోయింగ్ సంస్థలతో భారీ డీల్ కుదుర్చుకున్న టాటా.. ఇప్పుడు భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. కేబిన్ సిబ్బంది, పైలట్లు కలుపుకొని మొత్తం 5,100 మందిని తీసుకోనున్నట్లు టాటా గ్రూప్ వెల్లడించింది. ఇంటర్నేషనల్ సర్వీసులను విస్తరించే క్రమంలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. 5,100 ఉద్యోగాల్లో4,200 మంది ట్రైనీ కేబిన్‌ సిబ్బంది, 900 మంది పైలట్లు ఉండనున్నారు. వారికి 15 వారాల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.