భారతి ఎయిర్‌టెల్ ఇండియాలోని పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం ప్రియారిటీ పోస్ట్‌పెయిడ్ సేవలను మంగళవారం (మే 19, 2026) నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రియారిటీ పోస్ట్‌పెయిడ్ సర్వీస్.. పోస్ట్పెయిడ్ వినియోగదారులకు ప్రీమియం 5G నెట్‌వర్క్‌కు యాక్సెస్‌ను అందిస్తుండటం విశేషం.
వినియోగదారులకు బెటర్ ఎక్స్పీరియన్స్ అందించడానికి ఎయిర్‌టెల్ నెట్‌వర్క్.. స్లైసింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. ప్రస్తుతానికి ఇది కేవలం.. ఎయిర్ టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం మాత్రమే వినియోగించారు.
5G స్లైసింగ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఈ కొత్త సర్వీస్.. పోస్ట్పెయిడ్ వినియోగదారులకు మరింత మెరుగైన, స్థిరమైన నెట్‌వర్క్ అనుభవాన్ని అందించడానికి ఉద్దేశించి ఎయిర్ టెల్ తీసుకొచ్చింది. అంతరాయానికి ఆస్కారం లేని.. నిరంతరం కనెక్టివిటీపై ఆధారపడే ఉద్యోగ, వినోదం లేదా ఆన్‌లైన్ అవసరాలున్న బిజీ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు నిర్విరామంగా సేవలను అందించేందుకు ఈ ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ సేవలను ఎయిర్ టెల్ అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీ్స్ కోసం.. ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్‌ను ఆధునిక స్లైసింగ్ టెక్నాలజీ సామర్థ్యాలతో అప్‌గ్రేడ్ చేసింది. దీంతో నెట్‌వర్క్ మరింత బెటర్ అవుతుంది.
నెట్‌వర్క్ సామర్థ్యాన్ని డైనమిక్‌గా విభజించడం వల్ల.. యూసేజ్ ఎక్కువగా ఉండే.. ట్రాఫిక్ డిమాండ్ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కూడా పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు స్థిరమైన, విశ్వసనీయమైన కనెక్టివిటీ అనుభవాన్ని ఎయిర్‌టెల్ అందిస్తోంది. ఇందుకు ఈ స్లైసింగ్ టెక్నాలజీనే కారణం. 2025లోనే USA, సింగపూర్, యునైటెడ్ కింగ్‌డమ్, మలేషియా వంటి అనేక దేశాల్లో స్లైసింగ్ ఆధారిత 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి.
►ALSO READ | Paytm: ఇకపై పేరెంట్స్ ఫోన్లతో పనిలేదు.. పిల్లల కోసమే ప్రత్యేకంగా ‘పేటీఎం పాకెట్ మనీ’
భారత్‌లో ఈ తరహా సేవను ప్రారంభించిన మొదటి సంస్థ ఎయిర్‌టెల్ కావడం విశేషం. ప్రీపెయిడ్ వినియోగదారులు లేదా ఎయిర్‌టెల్ ప్రియారిటీ పోస్ట్‌పెయిడ్‌కు మారాలనుకునే కస్టమర్లు Airtel App ద్వారా లేదా సమీపంలోని ఎయిర్‌టెల్ స్టోర్‌ను సందర్శించి సులభంగా మారొచ్చని ఎయిర్ టెల్ తెలిపింది.
