అఖిల్ ‘ఏజెంట్‌’ టీజర్‌ వచ్చేసింది

 అఖిల్ ‘ఏజెంట్‌’ టీజర్‌ వచ్చేసింది

అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ  ‘ఏజెంట్‌’. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. కొద్దిసేపటి క్రితమే సినిమాకు సంబంధించిన టీజర్‌  ను రిలీజ్ చేశారు మేకర్స్ . స్పై థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న  ఈ సినిమాలో హాలీవుడ్‌ రేంజ్‌లో యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేసినట్టుగా టీజర్‌  ను చూస్తే తెలుస్తోంది. అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ, చెప్పిన  డైలాగ్స్ టీజర్‌  కు హైలెట్ గా నిలిచాయి. మమ్ముటి కీలకపాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల నడుమ ఈ  సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేయనున్నారు.