చాయ్లో విషం కలిపితే.. పోలీసుల్ని నమ్మను: అఖిలేష్ యాదవ్

చాయ్లో  విషం కలిపితే.. పోలీసుల్ని నమ్మను: అఖిలేష్ యాదవ్

యూపీ పోలీసులపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఇచ్చిన చాయ్ తాగేందుకు ఆయన నిరాకరించారు. టీ పేరుతో విషం ఇస్తే ఏంచేయాలని.. తాను పోలీసుల్ని నమ్మను అంటూ వ్యాఖ్యానించారు. తాను బయటి నుంచే టీ తెప్పించుకుంటానని చెప్పారు. అంతకుముందు.. ఎస్పీ ట్విటర్‌ ఖాతా నిర్వాహకుడు మనీశ్‌ జగన్‌ అగర్వాల్‌ అరెస్టుతో ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో అఖిలేశ్‌యాదవ్‌ అక్కడి డీజీపీ ఆఫీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీసులు టీ ఇవ్వగా..ఆయన దానిని తిరస్కరించారు. 

ఇదిలా ఉండగా.. సమాజ్‌వాదీ ట్విటర్‌ ఖాతా నుంచి అభ్యంతరకర పోస్టులు చేశారని అగర్వాల్ పై కేసులు నమోదయ్యాయి. దీంతో లఖ్‌నవూ పోలీసులు అగర్వాల్‌ను అరెస్టు చేశారు. దీన్ని నిరసిస్తూ పార్టీ వర్గాలు ఆందోళనకు దిగాయి. మనీశ్‌ అగర్వాల్‌ను అరెస్టు చేయడం సిగ్గుచేటంటూ వారు ఆరోపించారు. పోలీసులు వెంటనే అతడిని విడుదల చేయాలంటూ అఖిలేశ్ యాదవ్ నిరసన చేపట్టారు.