సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చాకే యాత్రలో పాల్గొంటా

సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చాకే యాత్రలో పాల్గొంటా

ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రకు హాజరవుతారా లేదా అనేది సందిగ్ధంలో కొనసాగుతుంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఇరు పార్టీల పొత్తు, సీట్ల పంపిణీ పై కాంగ్రెస్, ఎస్పీ మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.  సీట్ల పంపిణీ కొలిక్కివ‌చ్చిన అనంత‌రం కాంగ్రెస్ న్యాయ్ యాత్ర‌లో ఎస్పీ పాల్గొంటుంద‌ని అఖిలేష్ యాద‌వ్ తెలిపారు. సోమ‌వారం సాయంత్రానికి సీట్ల పంపిణీ ఖ‌రారైతే అఖిలేష్ యాద‌వ్ భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌లో పాల్గొంటార‌ని లేకుంటే రాహుల్ యాత్ర‌కు ఆయ‌న దూరంగా ఉంటార‌ని ఎస్పీ నేతలు చెబుతున్నారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో యూపీలో కాంగ్రెస్‌కు, ఎస్పీ 11 స్ధానాల‌ను ఆఫ‌ర్ చేసినట్టు సమాచారం. మ‌రిన్ని సీట్లు కేటాయించాల‌ని కాంగ్రెస్ ప‌ట్టుబ‌డుతోంది. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని అఖిలేష్ యాదవ్ ను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానించారు. సీట్ల పంపిణీ కొలిక్కి రాగానే  అమేథి, రాయ్ బ‌రేలిలో ఏదో ఒక ప్రాంతంలో తాను యాత్ర‌లో పాల్గొంటారని సమాచారం.