ఏజెంట్ మూవీలో లోపాలున్నాయి.. అమల షాకింగ్ కామెంట్స్

ఏజెంట్ మూవీలో లోపాలున్నాయి.. అమల షాకింగ్ కామెంట్స్

అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ పై అక్కినేని అమల షాకింగ్ కామెంట్స్ చేసారు. ఏజెంట్ మూవీలో కొన్ని లోపాలున్నాయని ఓపెన్ చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. స్టైలిష్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ బడ్జెట్ మూవీ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ సినిమా మొదటి షో నుండి నెగిటీవ్ టాక్ ని సొంతం చేసుకొని ప్లాప్ లిస్టులోకి చేరిపోయింది. దీంతో సోషల్ మీడియాలో అఖిల్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఇలాంటి సినిమాలు చేయడం మానేసి కొత్త కథలను చేయమని సలహాలు ఇస్తున్నారు.

తాజాగా ఈ ట్రోల్స్ పై అఖిల్ తల్లి అమల అక్కినేని స్పందించారు.“దైర్యంగా మాట్లాడలేనివారు మాత్రమే ఇలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తారు. అలాంటి ట్రోల్స్ ని పట్టించుకోవడం అనవసరం. అఖిల్ కు కూడా అదే చెప్పాను. ఏజెంట్ సినిమా నేను చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. అఖిల్ కూడా చాలా బాగా చేశాడు. సినిమా కోసం అఖిల్ పడ్డ కష్టం ప్రతీ ఫ్రెమ్ లో కనిపిస్తుంది. నిజమే సినిమాలో కొన్ని లోపాలున్నాయి. నేను కాదు అనడం లేదు కానీ.. సినిమా చూస్తున్నంత సేపు అవేమి నాకు కనిపించలేదు. నేను ఈ సినిమాని థియేటర్ లో చూశాను. అక్కడ అమ్మలు, అమ్మమ్మలు, అమ్మాయిలు, కుర్రాళ్ళు.. ఎవరికి ఏ సీన్ నచ్చితే.. అప్పుడు వారు పెద్దగా అరుస్తున్నారు అని చెప్పుకొచ్చిన అమల.. అఖిల్ నెక్స్ట్ మూవీ మీ అందరిని మెప్పించాలని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమల చేసిన ఈ కామెట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.