గడ్కరీ షేర్ చేసిన అక్షయ్ కుమార్ వీడియోపై విమర్శలు

గడ్కరీ షేర్ చేసిన అక్షయ్ కుమార్ వీడియోపై విమర్శలు

కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉండాలంటూ నితిన్ గడ్కరీ షేర్ చేసిన ఓ వీడియో వైరల్గా మారింది. అక్షయ్ కుమార్ నటించిన ఓ యాడ్ను గడ్కరీ ట్వీట్ చేయగా..అది కాస్త వివాదంగా మారింది. వరకట్నాన్ని ప్రోత్సహించేలా ఈ వీడియో ఉందంటూ పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

వీడియోలో ఏముందంటే..?

తల్లిదండ్రులు కూతురుకు పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుతుండగా..అక్షయ్ పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇస్తాడు. రెండు ఎయిర్ బ్యాగులు ఉన్న కారులో వెళ్తే మీ అమ్మాయి సురక్షితంగా ఉండదంటూ అమ్మాయి తండ్రితో అంటాడు. ఆ తర్వాత పెళ్లి కూతురు ఆరు ఎయిర్ బ్యాగులున్న కారులో వెళ్తుంది. ఈ యాడ్ వరకట్నాన్ని ప్రోత్సహించేలా ఉందంటూ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. ప్రభుత్వం కారు భద్రతా అంశాన్ని ప్రచారం చేయడానికి డబ్బు ఖర్చు చేస్తుందా..? లేక వరకట్నాన్ని ప్రోత్సహించడానికి చేస్తుందా అని ప్రశ్నించారు.

 

ఇటీవల టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. వెనుక సీట్లో ఎయిర్ బ్యాగ్స్ లేకపోవడం ఆయన మరణించారనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఎయిర్ బ్యాగ్స్ పై అవగాహన కల్పించేందుకు అక్షయ్ తో ఓ యాడ్ రూపొందించారు. అయితే ఇది సోషల్ మీడియాలో విమర్శలకు తావిస్తోంది.