రాములో..రాములా అంటున్న మెగా ఫ్యాన్స్

రాములో..రాములా అంటున్న మెగా ఫ్యాన్స్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా అల వైకుంఠపురములో. బన్నీ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి సామజవరగమన అనే సాంగ్ మెగా ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తుండగా .. మంగళవారం రిలీజైన మరో సాంగ్ టీజర్ ఆకట్టుకుంటోంది.

‘రాములో..రాములా నన్నాగం చేసిందిరో’అనే సాంగ్ టీజర్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తమన్‌ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ను అనురాగ్‌ కులకర్ణి, మంగ్లీ పాడారు. ఈ సాంగ్ మాస్‌ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ టబు కీలకపాత్రలో నటిస్తుంది.