కేంద్ర ఎన్నికల సంఘం యూటర్న్.. కొత్త ఓటర్ల నమోదు విషయంలో పెట్టిన రూల్స్ ను ఈసీ సడలించింది. కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకునే జెన్ జీలు ఇకపై తమ తల్లిదండ్రులు, తాతమ్మల పేర్ల వివరాలను సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు లేవనెత్తిన సర్ ప్రక్రియలోని ఫారం 6 లో పేరెంట్స్ డిడెయిల్స్ కాలంను మాండేటరి వివాదంతో సర్ నిబంధనల్లో మార్పులు చేసింది.
ప్రస్తుతం సర్ ప్రక్రియ కొనసాగుతున్న 20 రాష్ట్రాల్లో ఈ కొత్త రూల్స్ అమలులో ఉంటాయని తెలిపింది. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) లో నిబంధనలు సడలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇకపై కొత్తగా ఓటరు నమోదు చేసుకునే జెన్ జీలకు తాతమ్మలు, పేరెంట్స్ వివరాలు తప్పనిసరి కాదని ఫారం 6లోని రూల్స్ లో మార్పులు చేసింది.
ఫారం 6లో చేసిన మార్పులపై ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో అంతర్గత అభ్యంతరాలు వ్యక్తమైనట్లు వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఈ చర్య తీసుకున్నారు. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఈ డిక్లరేషన్‌ను చేర్చడంపై అభ్యంతరాలు లేవనెత్తినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టులో తేల్చింది. రికార్డుల ప్రకారం 1960 ఓటర్ల నమోదు నిబంధనలకు ఎలాంటి సవరణ చేయనందున దీని చట్టబద్ధతను వారు ప్రశ్నించారు.
