జ్యోతిష్యం : కన్యరాశి వారికి అద్భుతమైన నెల అక్టోబర్... వీరికి గోల్డెన్ పిరియడ్ స్టాటయినట్టే

జ్యోతిష్యం :  కన్యరాశి వారికి అద్భుతమైన నెల అక్టోబర్... వీరికి గోల్డెన్ పిరియడ్ స్టాటయినట్టే

 కన్యారాశి వారికి అక్టోబరు 2026 అద్భుతమైన ప్రయోజనాలను ఇచ్చే మాసమని పండితులు చెబుతున్నారు. లాభ స్థానంలో గురుడి అనుకూల ప్రభావం వల్ల మీ వృత్తి జీవితంలో ఊహించని పురోగతి ఉంటుంది. మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు లభించడమే కాకుండా ప్రమోషన్లు లేదా జీతం పెంపు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రాశి వారికి 2026 అక్టోబర్​ నెల గోల్డెన్​ మంత్​ అని పండితులు చెబుతున్నారు. 

అక్టోబర్ మాసంలో అనేక పండుగలు ప్రారంభం కావడంతో చాలా గ్రహాలు కూడా తమ స్థానాలను మార్చుకుంటాయి.  ఈ నెలలో ( 2026 అక్టోబర్) గ్రహాలు, నక్షత్రాలు సంచారంలో అనేక మార్పులు జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  

అక్టోబర్​లో గ్రహాల స్థాన చలనం మార్పుల వివరాలు

  • అక్టోబర్ 3: తులారాశిలో శుక్రుడు వక్రగతి సంచారం
  •  అక్టోబర్ 17:   తులారాశిలోకి  సూర్యుడు 
  • అక్టోబర్ 24: తులారాశిలో   బుధుడు వక్రగతి సంచారం
  • అక్టోబర్ 31: సింహరాశిలోకి గురుడు 

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ నెలలో ( 2026 అక్టోబర్)​ శుక్రుడు.. సూర్యుడు..బుధుడు గ్రహాల సంచారంలో జరిగే మార్పుల వలన లక్ష్మీనారాయణ యోగం, మాళవ్య యోగం, బుధాదిత్యయోగం ఏర్పడనున్నాయి. వీటితో పాటు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

విదేశీ ప్రయాణాలు లేదా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఆర్థికంగా ఇది మీకు అత్యంత అనుకూలమైన సమయం. ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి ఆదాయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

 వ్యాపారవేత్తలకు లాభాలు గణనీయంగా పెరుగుతాయి. . ఆర్థిక స్థిరత్వం పెరిగి పాత బకాయిలు కూడా వసూలవుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే ఆలోచన ఉన్నవారికి ప్రయత్నాలు కలసివస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. సంతానం లేని వారికి లేదా సంతాన పురోగతి కోసం చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. 

వివాహ ప్రయత్నాల్లో ఉన్న కన్యా రాశి వారికి అనుకూలమైన సంబంధాలు కుదురుతాయి. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. రోజూ ధ్యానం చేయడం, గురువారం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ద్వారా మరింత శుభఫలితాలు అందుతాయి.

ALSO READ : జ్యోతిష్యం :సింహరాశి వారి జాతకం .. అక్టోబర్నెల సవాళ్ల మంత్..

ఈ రాశి వారికి అక్టోబర్​ నెలలో 11 వ ఇంట్లో కుజుడి సంచారం వలన సమాజంలో గౌరవం, కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. గురుడు 12 వ ఇంట్లోకి ప్రవేశించడంతో ఆర్థికంగా అభివృద్ది చెందుతారు. ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.7వ  ఇంట్లో శని వక్రగతి వలన దంపతుల మధ్య చిన్నపాటి అభిప్రాయబేధాలు వచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, ప్రతీకారం తీర్చుకోవడానికి బదులుగా, చిరునవ్వుతో పరిస్థితిని చక్కదిద్దండి. 

చేయాల్సిన పరిహారాలు:

  • ఉదయం .. సాయంత్రం సూర్యుని నీళ్లను సమర్పించడం
  • రోజూ కొంత సేపు మౌనంగా ధ్యానం చేయడం
  • ప్రతి బుధవారం  పేద విద్యార్థులకు  పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంచిపెట్టడం
  • గోమాతకు ఆకు కూరలు ఆహారంగా ఇవ్వడం
  • విష్ణువు నామాన్ని జపించండి
  • ప్రతిశనివారం  విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం
  • శనివారం పేదలకు అన్నదానం 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.