కర్ణాటక మంగళూరులో భారీ పేలుడు కలకలం రేపింది. జోకట్టే సమీపంలోని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(MRPL) ప్రాంగణం నుంచి ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. పేలుడు తర్వాత దట్టమైన పొగ ఆకాశంలోకి ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు.పేలుడు తీవ్రతకు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లకు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే పేలుడుకు అసలు కారణం ఏంటి? ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది? అనే వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు అధికారిక ప్రకటన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
