మండే వేసవిలో చల్లటి ఫీలింగ్.. ‘ఉగ్రం’ నుంచి కొత్త సాంగ్ రిలీజ్

మండే వేసవిలో చల్లటి ఫీలింగ్.. ‘ఉగ్రం’ నుంచి కొత్త సాంగ్ రిలీజ్

నాంది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న అల్లరి నరేశ్(Allari naresh) ఉగ్రం సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. నాంది సినిమాకు దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడల ఈసినిమా(Ugram)ను కూడా తెరకెక్కిస్తున్నాడు. అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా మే 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఇందుకు ఇంకా నెల రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. సినిమాకు సంబంధించిన టీజర్ తో పాటుగా ఒక పాటను విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి అల్బేలా అల్బేలా అనే సెకండ్ సింగిల్ ను హీరో నాని(Nani) విడుదల చేశారు.

 టైటిల్ లో ఉన్న సీరియస్ నెస్ సినిమాలో ఉండదు అన్నట్టుగా  ఈ సాంగ్ పిక్చరైజేషన్ ఉంది. మంచి లోకేషన్లలో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లిన హీరో పాడుకునే పాట ఇది. మండే వేసవిలో చల్లటి ఫీలింగ్ ఇస్తున్న ఈ పాటకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా.. లిరిక్స్ ను భాస్కరభట్ల రాశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది.