హైదరాబాద్ వాసులకు అలర్ట్: జూన్ 8, 15న హైడ్రా ప్రజావాణి రద్దు

హైదరాబాద్ వాసులకు అలర్ట్: జూన్ 8, 15న హైడ్రా ప్రజావాణి రద్దు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ నెల 8, 15న నిర్వహించాల్సిన హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ర‌‌‌‌ద్దు చేసిన‌‌‌‌ట్లు క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ రంగ‌‌‌‌నాథ్ శ‌‌‌‌నివారం ఒక ప్రక‌‌‌‌ట‌‌‌‌న‌‌‌‌లో తెలిపారు. పెండింగ్ ఫిర్యాదులు క్లియ‌‌‌‌ర్ చేసే క్రమంలో మే 11వ తేదీ నుంచి 4 సోమ‌‌‌‌వారాలు ప్రజావాణికి బ్రేక్ ఇచ్చారు. ప‌‌‌‌రిష్కరించాల్సిన ఫిర్యాదులు ఇంకా ఉన్నందున గ‌‌‌‌డువును మ‌‌‌‌రో రెండు వారాలు పెంచిన‌‌‌‌ట్లు కమిషనర్​పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి కార్యక్రమం య‌‌‌‌థావిధిగా కొనసాగుతుందని 
తెలిపారు.