నాటు నాటు పాటకు ఆలియా భట్ అదిరిపోయే స్టెప్పులు

నాటు నాటు పాటకు ఆలియా భట్ అదిరిపోయే స్టెప్పులు

ప్రపంచవ్యాప్తంగా నాటు నాటు పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాటు నాటు పాట వింటే చాలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా ఎవరైనా స్టెప్పు వేయాల్సిందే. తాజాగా ఈ పాటకు ట్రిపుల్ ఆర్ బ్యూటీ ఆలియా భట్ స్టెప్పు వేసింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా తనలో ఏ మాత్రం ఎనర్జీ తగ్గలేదు. స్టేజ్ పై అంతమంది ఉన్నా.. అందరూ ఆలియా డ్యాన్స్ పైనే పొగడ్తలు కురిపిస్తున్నారు. బాలీవుడ్‌లో ‘జీ సినిమా అవార్డుల’ ప్రధానోత్సవం ఆదివారం రాత్రి ముంబయిలో జరిగింది. బాలీవుడ్‌ స్టార్‌ సెలబ్రిటీలు బోనీకపూర్‌, వివేక్‌ అగ్నిహోత్రి, అయాన్‌ ముఖర్జీ, ఆలియా భట్‌, కార్తిక్‌ ఆర్యన్‌, రష్మిక, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, తదితరులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. గంగూబాయి కఠియావాడి, డార్లింగ్స్ కు గాను ఆలియాకు రెండు అవార్డులు వచ్చాయి. ఈ సంతోషంలో ఆలియా నాటు నాటు పాటకు అదరగొట్టేలా డ్యాన్స్‌ చేసి అభిమానులను అలరించారు. ఓ అభిమాని ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా క్షణాల్లో అది వైరల్‌గా మారింది. ఆలియా గ్రేస్‌ను చూసిన ఫ్యాన్స్‌.. నాలుగు నెలల కిందటే పాపకు జన్మనిచ్చింది. అంతలోనే ఎంత జోరుగా డ్యాన్స్‌ చేస్తోందో, నీకు ఎవరూ సాటి లేరంటూ ఆలియాపై కామెంట్స్ చేస్తున్నారు.