అల్లరి నరేష్ బ్యాక్ టు కామెడీ.. సీరియస్ రోల్స్ నుంచి మళ్లీ కామెడీ ట్రాక్ లోకి

అల్లరి నరేష్ బ్యాక్ టు కామెడీ.. సీరియస్ రోల్స్ నుంచి మళ్లీ కామెడీ ట్రాక్ లోకి

కామెడీ చిత్రాలతో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న అల్లరి నరేష్.. ఇటీవల వరుస సీరియస్ రోల్స్‌‌లో నటిస్తున్నాడు. తాజాగా తన 65వ చిత్రంతో తిరిగి కామెడీ జానర్‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు.  శనివారం  అన్నపూర్ణ  స్టూడియోలో  పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం  ప్రారంభమైంది.  ముహూర్తపు షాట్‌‌కు నాగ చైతన్య క్లాప్ కొట్టగా,  దర్శకులు  బాబీ కెమెరా స్విచాన్  చేశాడు.  వి.ఐ. ఆనంద్ ఫస్ట్ షాట్‌‌కు గౌరవ దర్శకత్వం వహించగా, వశిష్ట, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల స్క్రిప్ట్‌‌ను నిర్మాతలకు అందజేశారు.  

హరీష్​శంకర్, సుప్రియ యార్లగడ్డ, అనిల్ సుంకర, జెమిని కిరణ్ ఈ కార్యక్రమానికి హాజరై టీమ్‌‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ సినిమాకు చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫాంటసీ, కామెడీ బ్లెండ్‌‌తో  రిఫ్రెషింగ్‌‌గా ఉండబోతోందని.. నరేష్‌‌ తనదైన కామెడీతో విశ్వరూపం  చూపించబోతున్నారని  మేకర్స్ చెప్పడం క్యూరియాసిటీని పెంచింది. 

ఈ చిత్రంలో  నరేష్​  సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారని చెప్పారు.  వెన్నెల కిషోర్, నరేష్ వి.కె,  శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్  కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్, చోటా కె ప్రసాద్ ఎడిటర్‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు.  త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.