
అల్లరి నరేష్(Allari Naresh) హీరోగా కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. తాజాగా జూన్ 30 అల్లరోడి పుట్టినరోజు సందర్బంగా.. నరేష్ కొత్త సినిమా నుండి అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. N62 అంటే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను.. దర్శకుడు సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తున్నారు. మూర్ఖత్వం బార్డర్ దాటిన ఒకడి జీవిత కథ లైన్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇక ఈ సినిమా నుండి రిలీజైన N62 అనౌన్స్మెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో నరేష్ కు దర్శకుడు సుబ్బు మంగదేవి కథ వివరిస్తూ కనిపించారు. చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు.. ఆడియన్స్ లో సినిమాపై ఇంట్రస్ట్ ను క్రియేట్ చేసింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాకు సంబందించిన క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ త్వరలో తెలుపనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
అల్లరి నరేష్ గత చిత్రం ఉగ్రం(Ugram).. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. నాంది వంటి సూపర్ హిట్ తరువాత నరేష్ అండ్ విజయ్ కనకమేడల(Vijay kanakamedala) కాంబోలో వచ్చిన ఉగ్రం సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలను నిలబెట్టుకోలేకపోయింది ఈ సినిమా. మరి అల్లరి నరేష్ నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ అయినా ప్రేక్షకులను అలరించి.. హిట్ అందుకుంటుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.