SI శ్రీనివాస్ రెడ్డి ట్రైనీ లేడీ ఎస్సై పై లైంగిక వేధింపులు

SI శ్రీనివాస్ రెడ్డి ట్రైనీ లేడీ ఎస్సై పై లైంగిక వేధింపులు

మహబూబాబాద్ జిల్లా మరిపెడ SI శ్రీనివాస్ రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మరిపెడ SIపై ఈ ఆరోపణలు చేశారు ట్రైనీ లేడీ SI. నిన్న రాత్రి అడవిలోకి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేయబోయాడని చెప్పారు. SI శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషికి ఫిర్యాదు చేశారు ట్రైనీ లేడీ SI. తనకు న్యాయం చేయకుంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానన్నారామె. దళితురాలు కాబట్టే ఆమెపై ఎస్సై అత్యాచారానికి ప్రయత్నించాడని ట్రైనీ లేడీ SI బంధువులు ఆరోపిస్తున్నారు. 
ట్రైనీ లేడీ SI ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు వరంగల్ సీపీ తరుణ్ జోషి. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలితే.. SI శ్రీనివాస్ రెడ్డిపై చట్టపరమైన  చర్యలు తీసుకుంటామన్నారు.