ఐసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్

ఐసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్

హైదరాబాద్, వెలుగు: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీఎస్​ఐసెట్ స్పెషల్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయ్యింది. మొత్తం 32,299 సీట్లకు గాను 27,075 సీట్లు నిండినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఎంబీఏలో 26,951 సీట్లకు గాను 22,679 సీట్లు నిండాయని, ఎంసీఏలో 5348 సీట్లకు గాను 4,396 సీట్లు భర్తీ అయ్యాయని వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 29లోగా ఆన్ లైన్​లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని, 31న కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు.