నాకు కూతురుంటే..అనుపమలా ఉండాలి: అల్లు అరవింద్

నాకు కూతురుంటే..అనుపమలా ఉండాలి: అల్లు అరవింద్

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్  పై నిర్మాత అల్లు అరవింద్ ప్రశంసలు కురిపించారు. తనకే ఒక కూతురు ఉంటే.. అనుపమలా ఉండాలని కొనియాడారు. హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటించిన 18 పేజెస్ సినిమా ప్రెస్ మీట్ లో  మాట్లాడిన అల్లు అరవింద్ అనుపమ నటన చాలా నాచురల్ గా ఉంటుందని..అందుకే ఆమె అంటే తనకు ఇష్టమని అన్నారు. తాము తీసిన 18 పేజెస్ సినిమా ఒక సాధారణ మైన లవ్ స్టోరీ కాదని... చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్  గోపి సుందర్  ఇప్పటి వరకు తమ బ్యానర్ లో ఏడు సినిమాలు చేశాడని.. అవన్నీ మ్యూజికల్ హిట్ అయ్యాయని అన్నారు. ఈ సినిమాకు కూడా గోపి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారని.. తన హృదయంలో ఆవేదన గానీ ఆ రాగం గానీ లేకపోతే ఇంతమంచి పాటలు రావన్నారు.  కార్తికేయ సినిమా తరువాత అదే జోడీతో ఈ 18 పేజెస్ సినిమా రావడం చాలా హ్యాపీ గా ఉందన్నారు.

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ18 పేజిస్  సినిమాను జీఏ 2 పిక్చర్స్,  సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు.  సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  గోపిసుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.