బన్నీతో రెండో సినిమా.. సేమ్ పాయింట్ రిపీట్ చేస్తున్నారా?

బన్నీతో రెండో సినిమా.. సేమ్ పాయింట్ రిపీట్ చేస్తున్నారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మరోసారీ రా అండ్ రస్టిక్ మూవీలో కనిపించనున్నారా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన సుకుమార్(Sukumar) దర్శకత్వంలో పుష్ప ది రూల్(Pushpa the rule) మూవీ చేస్తున్నారు. షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి పార్ట్ భారీ హిట్ కావడంతో.. రెండో పార్ట్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఈ సినిమాలో బన్నీ రా అండ్ రస్టిక్ లుక్ లో అదరగొట్టేశారు. అంతాకాదు బన్నీ మ్యానరిజమ్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. బన్నీ మరోసారి ఇలాంటి లుక్ లో ఆడియన్స్ మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడట. దీనికి సంబందించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. 

దసరా(Dasara) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth odela).. బన్నీ కోసం ఒక పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారట. ఈ కథ బన్నీ కి కూడా తెగ నచ్చేసిందట. వెంటనే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేయమని చెప్పాడట బన్నీ. దసరా సినిమా లాగే.. తన రెండో సినిమా కోసం కూడా రా అండ్ రస్టిక్ కాన్సెప్ట్ నే తీసుకున్నాడట శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనుందని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టు పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.