బాలీవుడ్ ఆఫర్‭కు నో చెప్పిన బన్నీ

బాలీవుడ్ ఆఫర్‭కు నో చెప్పిన బన్నీ

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్‭లో బిజీగా ఉన్నారు. పుష్ప పార్ట్ వన్ ఇండియా వైడ్‭గా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలోని తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఆ డైలాగ్‭ను వాడేస్తున్నారు. దీంతో పుష్ప 2 పై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఫ్రాంచైజీలో పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లుఅర్జున్ కు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది.

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించే జవాన్ చిత్రంలో.. అతిధి పాత్రలో నటించేందుకు అల్లు అర్జున్ కు ఆఫర్ వచ్చింది. కాని డేట్స్ లేకపోవడంతో అర్జున్ చాలా ఆలోచించిన తర్వాత ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ జవాన్ బృందం నుండి సినిమా కథను, కథనాన్ని కూడా ముందే తెలుసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ, ఎంత ప్రయత్నించినా పుష్ప 2 లో బిజీగా ఉండటం, ముందస్తు కమిట్‌మెంట్‌ల కారణంగా ఈ ఆఫర్‭ను వద్దనుకున్నాడు.

ఇదిలా ఉంటే వైజాగ్, హైదరాబాద్‌లోని కొన్ని లొకేషన్‭లలో పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాబోయే కొన్ని నెలలు, బన్నీ కేవలం పుష్పా 2 పైనే తన దృష్టి పెట్టబోతున్నాడు. ఇక ఈ సెకెండ్ పార్ట్ మొత్తం అల్లు అర్జున్ , ఫహద్ ఫాసిల్ పైనే ఉండనుంది. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లోనే సెకెండ్ పార్ట్ పై క్లారిటీని ఇచ్చాడు డైరెక్టర్. ఈ చిత్రంలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన్న, సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.