లావణ్య మంచి హౌస్ వైఫ్.. వైరలవుతున్న శిరీష్ వీడియో

లావణ్య మంచి హౌస్ వైఫ్.. వైరలవుతున్న శిరీష్ వీడియో

మెగా హీరో వరుణ్ తేజ్(Varun tej) లావణ్య త్రిపాఠి(Lavanya tripathi) ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. ఇక వీరి నిశ్చితార్ధ వేడుక జూన్ 9న మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారు అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. 

అయితే తాజాగా లావణ్యకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కూడా అల్లు శిరీష్ లావణ్య గురించి చెప్పిన వీడియో. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. 2019లో వచ్చిన ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఈ సినిమా రిలీజ్ సమయంలో అల్లు అర్జున్, లావణ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ వీడియోలో అల్లు శిరీష్ లావణ్య గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు... లావణ్య చాలా మంచి హౌస్ వైఫ్, వంట చాలా బాగా చేస్తుంది. అందరితో చాలా బాగుటుంది, చిన్న పిల్లలు, పెద్దల విషయంలో ఓపికగా, సహనంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు శిరీష్. అప్పటి వీడియోను సోషల్ మీడియా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు నెటిజన్స్.