జీడిమెట్ల, వెలుగు: అతివేగంగా బస్సు నడిపిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. జాతీయ రహదారి పై మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. ప్రమాదస్థలాన్ని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు బుధవారం ఉదయం పరిశీలిస్తున్నారు. అదే సమయంలో నిజామాబాద్నుంచి సిక్రిందాబాద్వైపు ఆర్టీసీ బస్సు అతివేగంగా వెళ్తుండడంతో ట్రాఫిక్ సీఐ రవీందర్ రెడ్డి గమనించి రూ.1,500 జరిమానా విధించారు. ఈ బస్సుపై గతంలో రాజేంద్రనగర్ప్రాంతంలో రూ.1,100 జరిమానా విధించగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.
