హైదరాబాద్ లో మంగళవారం ( జూన్ 9 ) కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో కుండపోత వర్షం కురవడంతో రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి నరకం చూశారు జనం. ఈ క్రమంలో హైదరాబాద్ లోని కోఠిలో ఉన్న ENT హాస్పిటలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. బుధవారం ( జూన్ 10 ) ఉదయానికి కూడా ఆసుపత్రి పరిసరాల్లో చేరుకున్న బురద తొలగించకపోవడంతో బురద, మురుగు వాసనతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కుంటున్నారు.
మురుగు ప్రక్కన నుండే క్యూ లైన్ లో నిల్చున్న రోగులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కుంటున్నారు.ఇటు మున్సిపల్ అధికారులు,హైడ్రా సిబ్బంది కి పిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఆసుపత్రి సిబ్బంది.
బురద, మురుగు వాసన తట్టుకోలేకపోతున్నామని... ఆసుపత్రికి వస్తే ఉన్న రోగాల మాట దేవుడెరుగు... కొత్త రోగాలు వచ్చేలా ఉన్నాయని అంటున్నారు రోగులు. అధికారులు త్వరగా స్పందించి ఆసుపత్రి పరిసరాలు త్వరగా శుభ్రం చేయించాలని కోరుతున్నారు రోగులు.
