హైదరాబాద్ లో కంటిన్యూగా ముసురు...ఐటీ ఏరియాలో భారీగా ట్రాఫిక్...

హైదరాబాద్ లో కంటిన్యూగా ముసురు...ఐటీ ఏరియాలో భారీగా ట్రాఫిక్...

హైదరాబాద్ లో వర్షం పడితే ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యి గంటల కొద్దీ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన అనుభవం హైదరాబాద్ లో ఉంటున్న ప్రతి ఒక్కరికీ ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదే కంటిన్యూగా ముసురు పట్టుకుంటే ఎలా ఉంటుంది..? బుధవారం ( జులై 29 ) ఉదయం ఉదయం నుంచి ఇదే పరిస్థితి. హైదరాబాద్ లో ఉదయం నుంచి కంటిన్యూగా ముసురు పట్టుకోవడంతో ఐటీ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి రూట్ లో ట్రాఫిక్ మూమెంట్ స్లోగా సాగుతోంది. రాయదుర్గం కిమ్స్ హాస్పిటల్ దగ్గర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో ఐటీ ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసులకు వెళ్ళే టైమ్ కావడంతో ట్రాఫిక్ లో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు.

దీనికి తోడు లింగంపల్లి నుంచి HCU వెళ్లే రూట్లో రోడ్ రిపేర్ వర్క్స్ కూడా జరుగుతున్న క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొండాపూర్ RTA ఆఫీస్ నుంచి కొత్తగూడ వరకు కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. BHEL నుంచి నల్లగండ్ల ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది.

ఇదిలా ఉండగా... తెలంగాణలోని పలు జిల్లాలతోపాటు, హైదరాబాద్​ లో మంగళవారం భారీ వాన కురిసింది. బుధవారం కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.  ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. 

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్​, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. మిగతా రాష్ట్రమంతా మోస్తరు వర్షాలు పడే చాన్స్​ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి.