ఆఫ్ఘన్‌తో వన్డే సిరిస్.. భారత్ తుది జట్టు ఇదేనా?

ఆఫ్ఘన్‌తో వన్డే సిరిస్.. భారత్ తుది జట్టు ఇదేనా?

Team India Playing XI: ఆఫ్ఘనిస్తాన్‌తో ముల్లన్‌పూర్‌ వేదికగా జరిగిన ఏకైక టెస్టులో ఇన్నింగ్స్, 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టీమిండియా సిరీస్‌ను గ్రాండ్‌గా ఆరంభించింది. ఈ టెస్టు ద్వారా భారత జట్టుకు కావాల్సినంత ప్రాక్టీస్‌ లభించింది. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ లాంటి యువ ఆటగాడు తనను తాను నిరూపించుకోవడానికి ఇదొక చక్కని వేదికగా నిలిచింది. టెస్టు మ్యాచ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి జూన్ 13, 17, 20 తేదీల్లో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌పై పడింది.

కోహ్లి ఔట్.. రోహిత్, హార్దిక్ ఇన్:
గాయం కారణంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ వన్డే సిరీస్‌కు దూరం కావడంతో, అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌ను సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు, చాలా రోజుల తర్వాత ఇషాన్ కిషన్ సైతం వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇక గాయాల నుంచి కోలుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులో చేరారు. దీంతో తొలి వన్డేలో భారత తుది జట్టు (Playing XI) కూర్పుపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. 

ఇషాన్ కిషన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నా.. జైస్వాల్‌కే నా ఓటు!
టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. తొలి వన్డే కోసం తన అంచనా జట్టును ప్రకటించారు. ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున 602 రన్స్ చేయడంతో పాటు కెప్టెన్‌గానూ దుమ్ములేపిన ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టడం గమనార్హం. టీ20 వరల్డ్ కప్ 2026లోనూ రాణించిన ఇషాన్ కంటే.. యశస్వి జైస్వాల్‌కే తుది జట్టులో పెద్దపీట వేయాలని అభిషేక్త నాయర్ సూచించారు. 

►ALSO READ | క్రికెట్ ఆడిన ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ టీమ్.. నెట్టింట వీడియోలు వైరల్!

బ్యాటింగ్ లిస్ట్ ఇదే: 
తొలి వన్డేలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. విరాట్ కోహ్లి లేని వన్‌డౌన్ (నెం.3) స్థానంలో యశస్వి జైస్వాల్‌కి అవకాశం ఇవ్వాలి.. మూడో స్థానంలోనూ జైస్వాల్ బాగా రాణిస్తాడు.. శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో, కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో ఆడనుండగా, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే వరుసగా 6, 7, 8 స్థానాల్లో బ్యాటింగ్‌కు చేయాలని అభిషేక్ నాయర్ వెల్లడించారు. ఇక తన జట్టులో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు గుర్నూర్ బ్రార్కు చోటివ్వగా, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ను తీసుకున్నాడు.  

ఐపీఎల్ ప్రదర్శనల లెక్కలు ఇవే:  
* ఇషాన్ కిషన్ (SRH): ఐపీఎల్ 2026లో 602 పరుగులతో వీరవిహారం చేశాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
* యశస్వి జైస్వాల్ (RR): రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్‌గా 16 మ్యాచ్‌లలో 427 రన్స్ సాధించాడు.
* ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇషాన్‌ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అభిషేక్ నాయర్ మాత్రం జైస్వాల్ వైపే మొగ్గు చూపడం విశేషం.


తుది జట్టు అంచనా: 
1 రోహిత్ శర్మ ఓపెనర్ 
2 శుబ్‌మన్‌ గిల్‌ ఓపెనర్ & కెప్టెన్
3 యశస్వి జైస్వాల్‌ –టాప్ ఆర్డర్ బ్యాటర్
4 శ్రేయస్‌ అయ్యర్‌ –మిడిల్ ఆర్డర్ బ్యాటర్
5 కేఎల్‌ రాహుల్‌ –వికెట్ కీపర్ బ్యాటర్
6 హార్దిక్‌ పాండ్యా –ఆల్‌రౌండర్
7 వాషింగ్టన్‌ సుందర్‌ –ఆల్‌రౌండర్
8 హర్ష్‌ దూబే –ఆల్‌రౌండర్
9 కుల్దీప్‌ యాడవ్‌ –స్పెషలిస్ట్ స్పిన్నర్
10 అర్ష్‌దీప్‌ సింగ్‌ –పేసర్
11 గుర్నూర్‌ బ్రార్‌ –పేసర్