Messi vs Ronaldo Rivalry: ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రైవల్రీకి మళ్లీ సమయం దగ్గరపడింది. లియోనెల్ మెస్సీ (Lionel Messi), క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) మైదానంలో ఒకరినొకరు ఢీకొని దాదాపు ఆరేళ్లు కావొస్తోంది. చివరిసారిగా ఛాంపియన్స్ లీగ్‌లో బార్సిలోనా, యువెంటిస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ పోటీపడ్డారు. ఆ మ్యాచ్‌లో మెస్సీ బార్సిలోనాపై రొనాల్డో రెండు గోల్స్ కొట్టి యువెంటిస్‌కు 3–0తో భారీ విజయాన్ని అందించాడు. ఆ తర్వాత ఇద్దరి మళ్లీ ముఖాముఖి తలపడే ఛాన్స్ రాలేదు.
కానీ, ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) లో అర్జెంటీనా, పోర్చుగల్ జట్లు క్వార్టర్ ఫైనల్స్‌లోనే తలపడే క్రేజీ ఛాన్స్ ఉంది. ఈ మెగా టోర్నీలో మెస్సీ అర్జెంటీనా గ్రూప్-జె లో ఉంటే, రొనాల్డో పోర్చుగల్ గ్రూప్-కె లో ఉంది. ఈ వరల్డ్ కప్‌లో మెస్సీ వర్సెస్ రొనాల్డో మాస్ ఫైట్ జరగడానికి మొత్తం మూడు ఇంట్రెస్టింగ్ అవకాశాలు ఉన్నాయి.
* క్వార్టర్ ఫైనల్లోనే హై వోల్టేజ్ పోరు:
ఒకవేళ అర్జెంటీనా గ్రూప్-జె లో, పోర్చుగల్ గ్రూప్-కె లో టాప్ ప్లేస్ సాధించి గ్రూప్ విన్నర్స్ లాగా నిలిస్తే.. టోర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇద్దరూ ఒకే వైపు వస్తారు. ఆ తర్వాత జరిగే రౌండ్ ఆఫ్ 32, రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లలో ఈ రెండు జట్లు గెలిస్తే.. డైరెక్ట్‌గా క్వార్టర్ ఫైనల్స్‌లోనే అర్జెంటీనా వర్సెస్ పోర్చుగల్ మ్యాచ్ ఫిక్స్ అవుతుంది. ఫ్యాన్స్ అంతా ఈ ఫైట్ కోసమే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
* రౌండ్ ఆఫ్ 16 లోనే అమీతుమీ:
ఒకవేళ అర్జెంటీనా, పోర్చుగల్ రెండు జట్లు తమ గ్రూపులలో సెకండ్ పొజిషన్లలో నిలిస్తే.. టోర్నమెంట్ స్ట్రక్చర్ ప్రకారం వీరు క్వార్టర్స్‌లో కలవరు. కానీ, అంతకంటే ముందే రౌండ్ ఆఫ్ 16 లోనే ఒకరినొకరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ గ్రూపుల్లో ఉన్న మిగతా టీమ్స్ క్వాలిటీ చూస్తే.. వీరు సెకండ్ ప్లేస్‌కు పడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి.
* న్యూజెర్సీలో వరల్డ్ కప్ ఫైనల్ వార్:
ఒకవేళ అర్జెంటీనా, పోర్చుగల్‌లలో ఒక జట్టు గ్రూప్ విన్నర్‌గా నిలిచి.. ఇంకొక జట్టు సెకండ్ ప్లేస్‌తో సరిపెట్టుకుంటే, వీరిద్దరి దారులు టోర్నమెంట్ ఎండింగ్ వరకు అస్సలు కలవవు.. ఇలాంటి సిట్యుయేషన్ వస్తే మెస్సీ, రొనాల్డోలు నేరుగా న్యూజెర్సీలో జరగబోయే ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ ఫైనల్లోనే తలపడతారు.
ఫైనల్లో మెస్సీ వర్సెస్ రొనాల్డ్ ఫైట్ కిర్రాక్:
మెస్సీ వర్సెస్ రొనాల్డో ఇద్దరికీ ఇదే లాస్ట్ ఫిఫా వరల్డ్ కప్ కాబట్టి.. వీరిద్దరి మధ్య ఇంకొక్క లాస్ట్ ఫైట్ చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ లవర్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఒకవేళ ఫుట్‌బాల్ దేవుళ్లు కరుణించి ఫైనల్లోనే వీరిద్దరి మ్యాచ్ పడితే మాత్రం అంతకంటే కిర్రాక్ ముగింపు ఇంకోటి ఉండదు.
