న్యూఢిల్లీ: అమెజాన్, గూగుల్ వంటి టెక్ కంపెనీలు డేటా సెంటర్, ఈ–కామర్స్, ఏఐ, సెమీకండక్టర్ వంటి వివిధ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని, గత ఆరు నెలల్లోనే అమెరికా నుంచి 60 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6 లక్షల కోట్ల) పెట్టుబడి హామీలు లభించాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం వెల్లడించారు.
అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన ఈ వివరాలను పంచుకున్నారు. భారత్, అమెరికాలు ఒక తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఇప్పటికే ఖరారు చేశాయి. దీంతో అమెరికాకు మన ఎగుమతులు పెరగనున్నాయి.
