ఇకపై అమెజాన్లో యాడ్స్ మోత.. ప్రైమ్ యూజర్స్కు షాక్

ఇకపై అమెజాన్లో యాడ్స్ మోత.. ప్రైమ్ యూజర్స్కు షాక్

ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఓటీటీ(OTT)ల హవా నడుస్తోంది. కొత్త కొత్త వెబ్ సిరీస్ లు, సినిమాలు, టాక్ షోలతో ఆడియన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. ఇప్పటికే పలు ఓటీటీ సంస్థలు ఇండియాలో తమ మార్కెట్ ను విస్తరించుకోవడానికి ప్రయతిస్తున్నాయి. 

కానీ.. ఓటీటీలలో ఇవన్నీ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం కొంత మొత్తాన్ని సబ్స్క్రిప్షన్ చార్జెస్ గా తీసుకుంటారు. ఇక ఫ్రీగా వచ్చే వాటి మధ్యలో ఎక్కువగా యాడ్స్ వేస్తూ ఉంటారు. అలా యాడ్స్ రాకూడదు అనుకుంటే డబ్బులు చెల్లించి సబ్స్క్రిప్షన్  తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఓటీటీ సంస్థలన్నీ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాయి. అయితే ఇప్పుడు మరో కొత్త ప్రయోగం చేసి సబ్‌స్క్రైబర్స్ కు షాక్ ఇవ్వబోతుంది అమెజాన్ ప్రైమ్ సంస్థ.

Also Read :- అదంతా అల్లు అర్జున్ పైన ఇష్టంతోనే.. జవాన్ దర్శకుడు అట్లీ

అదేంటంటే.. అమెజాన్‌ ప్రైమ్ లో డబ్బులు పే చేసి సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నా సరే.. గంట నిడివి ఉన్న వీడియోకి నాలుగు నిమిషాల యాడ్ ప్లే చేస్తారట. ఈ నిబంధన 2024 నుండి అమలు అవుతుందని సమాచారం. ఒకవేళ ఈ యాడ్స్ వద్దనుకుంటే.. సబ్‌స్క్రిప్షన్ కాకుండా మరోకొంత డబ్బులు కట్టాలట. అయితే అమెజాన్ ప్రైమ్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంపై నెటిజన్స్ నుండి విమర్శలు వస్తున్నాయి. డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నాక కూడా.. మళ్ళీ డబ్బులు అడగడం అనేది కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు. మరి ఈ నిర్ణయంపై అమెజాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.