అదంతా అల్లు అర్జున్ పైన ఇష్టంతోనే.. జవాన్ దర్శకుడు అట్లీ

అదంతా అల్లు అర్జున్ పైన ఇష్టంతోనే.. జవాన్ దర్శకుడు అట్లీ

షారుఖ్(Shahrukh khan) హీరోగా వచ్చిన జవాన్(Jawan) మూవీతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు టాలెంటెడ్ దర్శకుడు అట్లీ(Atlee). ఎమోషనల్ అండ్ యాక్షన్ బ్యాడ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన 15 రోజుల్లోనే ఏకంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ మూవీ. దీంతో దర్శకుడు అట్లీ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ట్రెండ్ ఆయ్యింది. 

ఇక అట్లీ నుండి వచ్చే తరువాత సినిమా ఏంటనేది కూడా ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ఈక్రమంలోనే ఆయన తన తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తెస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వాటిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న అట్లీ అల్లు అర్జున్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. నాకు  టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఆయన చేసిన అలా వైకుంఠపురం, పుష్ప సినిమాలు చాలా బాగా నచ్చాయి. ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు.కేవలం అల్లు అర్జున్ కోసమే ఆ సినిమాలు చూశాను. ఈ సినిమాలను షారుక్ ఖాన్ కి కూడా చూపించాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అట్లీ అల్లు అర్జున్ గురించి చెప్పిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంద. 

Also Read :- అదంతా అల్లు అర్జున్ పైన ఇష్టంతోనే.. జవాన్ దర్శకుడు అట్లీ

ఇక అట్లీ తరువాత సినిమా విషయానికి వస్తే.. ఆయన అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు బలంగా వస్తున్నాయి. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తో పుష్ప 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా చేయడానికి ఒకే చెప్పేశారు అల్లు అర్జున్. ఇక  అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో సినిమా రావాలంటే చాలా కాలం పట్టడం ఖాయం.