నాగ చైతన్యను పెళ్లి చేసుకోవాలి.. అందుకే ఇండస్ట్రీకి వచ్చాను

నాగ చైతన్యను పెళ్లి చేసుకోవాలి.. అందుకే ఇండస్ట్రీకి వచ్చాను

రీతూ చౌదరి(Ritu chaudary).. పలు టీవీ షోలలో పాల్గొంటూ ఆడియన్స్ లో మంచి పేరు సంపాదించుకుంది ఈ బ్యూటీ. అంతేకాదు తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ప్రస్తుతం జబర్థస్త్ లో అడపదడపా స్కిట్స్ చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా అలీ ఆల్ ఇన్ వన్’ షోలో పాల్గొంది. 

Also Read :- సూర్యతో బోయపాటి మూవీ.. ఊరమాస్ కాంబో సెట్

ఇందులో భాగంగా రీతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ షోలో భాగంగా రీతూ అల్లు అర్జున్ కరక్ట్ ప్లేస్ లో పెట్టే గేమ్ ఇచ్చాడు. దానికి రీతూ కూడా ఏమాత్రం తడబడకుండా పర్ఫెక్ట్ ప్లేస్ లో పెట్టింది. దీంతో ఆమెను నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ వా అని అడిగారు ఆలీ. దానికి సమాధానంగా రీతూ మాట్లాడుతూ.. నేను నాగ చైతన్యను పెళ్లి చేసుకుందామని ఇండస్ట్రీకి వచ్చాను అని చెప్పుకొచ్చింది. అది విన్న ఆలీ ఒక్కసారిగా షాకయ్యారు. అంతేకాదు ఆ ప్రోమో చుసిన ఆడియన్స్ కూడా అవాక్కయ్యారు. దీంతో ఫుల్ ఎపిసోడ్ లో ఇంకెన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసిందో ఈ బ్యూటీ అంటూ ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదిరిచూస్తున్నారు.