సూర్యతో బోయపాటి మూవీ.. ఊరమాస్ కాంబో సెట్

సూర్యతో బోయపాటి మూవీ.. ఊరమాస్ కాంబో సెట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ అనే పదానికి కేరాఫ్ అంటే బోయపాటి శ్రీను(Boyapati srinu) అనే చెప్పాలి. ఆయన సినిమాలన్నీ దాదాపు మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొనే తీస్తారు. ఇక రీసెంట్ గా బాలకృష్ణ(Balakrishna)తో ఆయన తీసిన డివోషనల్ అండ్ మాస్ ఎంటర్టైనర్ అఖండ(Akanda) బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఆయన ఉస్తాద్ హీరో రామ్(Ram) తో స్కంద(Skanda) మూవీ చేస్తున్నారు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. బోయపాటి తమిళ స్టార్ హీరో సూర్యతో ఒక మాస్ సినిమా చేస్తున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ అటు తమిళ ఇండస్ట్రీలో, ఇటు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి సూర్యకి ఒక పక్కా మాస్ మసాలా సినిమా పడితే ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే పక్కా మాస్ అండ్ కమర్షియల్ స్క్రిప్ట్ ను రెడీ చేశారట బోయపాటి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టు కు సంబందించిన అధికారిక ప్రకటన రానుంది. 

Also Read :- నా డబ్బు.. నా ఇష్టం.. నీకేంట్రా నొప్పి: మంచు లక్ష్మి

ఇక ప్రస్తుతం సూర్య దర్శకుడు శివతో పాన్ వరల్డ్ మూవీ కంగువ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.