వనస్థలిపురంలో లారీని ఢీ కొట్టిన అంబులెన్స్..

వనస్థలిపురంలో లారీని ఢీ కొట్టిన అంబులెన్స్..

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది.  వనస్థలిపురం ఆటో నగర్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అంబులెన్స్ ఢీ కొట్టింది.  ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ తో పాటు ఇద్దరు పేషెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి.  

అంబులెన్స్ లో ఇద్దరు పేషెంట్లను  హాస్పిటల్ కు  తరలిస్తుండగా ఈ  ప్రమాదం జరిగింది.అంబులెన్స్ పూర్తిగా లారీ కిందకు చొచ్చుకుపోయింది. దీంతో  అంబులెన్స్ లో ఇరుకుపోయిన పేషంట్ ను అతికష్టంతో స్థానికులు బయటకు తీశారు.  

ఈ ఘటనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు,స్థానికులు  లారీ కిందకు దూసుకెళ్లిన అంబులెన్స్ ను బయటకు లాగారు.  గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు .కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.