నెల రోజుల నుంచి విపరీతంగా పెరుగుతున్న సిల్వర్.. జస్ట్ సంక్రాంతి కొద్ది రోజులు ఉంది అనగా ప్రస్తుతం తగ్గటం షాపింగ్ చేయాలనుకుంటున్న వారికి ఊరటను కలిగిస్తోంది. మరో పక్క గోల్డ్ మాత్రం స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ భారతీయులకు బంగారం, వెండి అంటే అమితమైన ప్రేమ. అందుకే షాపింగ్ చేయాలనుకుంటున్న వారు తమ నగరాల్లో మారిన ధరలను గమనించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
తెలుగు రాష్ట్రాల్లో జనవరి 9న బంగారం రేట్లు పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో జనవరి 8 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.71 స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 871గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 715గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికి వస్తే భారీ ర్యాలీ నుంచి బ్రేక్ తీసుకుని తగ్గుముఖం పట్టింది. సరఫరా సమస్యలతో పాటుగా మరోపక్క అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని తెలుస్తోంది. అయితే శుక్రవారం జనవరి 9, 2025న వెండి రేటు కేజీకి రూ.3వేలు తగ్గుదలను నమోదు చేసి కొనుగోలుదారులను షాక్ కి గురిచేస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 68వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.268 వద్ద ఉంది.
