అమితాబ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

అమితాబ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

భారతీయ సినిమా అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు బాలీవుడు సూపర్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఎంపికయ్యారు. ఈ ప్రిస్టీజియస్ అవార్డుకు ఈ ఏడాది ఆయన్ను ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. 76 ఏళ్ల లెజెండరీ యాక్టర్ అమితాబ్ రెండు తరాలకు వినోదం పంచడంతో పాటు స్ఫూర్తి నింపారని అన్నారు.

ఈ అవార్డుకు బిగ్ బీ ఎంపికవడంతో మొత్తం దేశంతో పాటు అంతర్జాతీయంగా ఆయన అభిమానులు సంతోషంగా ఉన్నారన్నారు. అమితాబ్ కు హార్థిక శుభాకాంక్షలు చెప్పారు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్. ఈ అవార్డుకు ఎంపిక కావడంతో బిగ్ బీకి కరణ్ జోహార్, అనిల్ కపూర్ సహా సినీ ప్రముఖులు పలువురు అభినందనలు తెలిపారు.

Amitabh Bachchan To Receive This Year's Dadasaheb Phalke Award