ఒత్తిడిని దూరం చేసి.. దైవ చింతన పెంచేలా

ఒత్తిడిని దూరం చేసి.. దైవ చింతన పెంచేలా
  • ‘అమ్మానాన్న.. 21 రోజులు గుడి’
  • పికెట్​ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ లో ప్రారంభం

సికింద్రాబాద్, వెలుగు: సెల్​ఫోన్లకు అడిక్ట్ అయి దైవ చింతనకు దూరమైన పిల్లలు, యువతలో భక్తి భావాన్ని పెంపొందించి.. మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు ‘అమ్మానాన్న.. 21 రోజులు గుడి, విద్య’ ప్రోగ్రామ్​ నిర్వహిస్తున్నట్లు కంటోన్మెంట్​కు చెందిన వీఆర్ విజయరామరాజు తెలిపారు. కంటోన్మెంట్​సెగ్మెంట్ మొదటి ఎమ్మెల్యే వి.రామారావు, మంకమ్మల కుమారుడైన వీఆర్ విజయరామరాజు మంగళవారం పికెట్​లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఈ ప్రోగ్రామ్​ను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో 21 రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు పిల్లలు, యువతకు శిక్షణ ఉంటుందన్నారు. దైవభక్తితో పాటు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, క్రమశిక్షణ, విద్యా సంబంధ విషయాలను నేర్పుతామన్నారు. 21 రోజుల శిక్షణ పూర్తి చేసిన స్టూడెంట్లకు ప్రైజ్​లు అందజేస్తామన్నారు. మొదటి రోజు కార్యక్రమానికి సుమారు 200 మంది స్టూడెంట్లు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.