క్రేజీ లుక్స్.. అదిరిపోయే బ్యాటరీతో నథింగ్ ఫోన్ 4B లాంచ్.. ఆర్సీబీ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ఎడిషన్ కూడా!

 క్రేజీ లుక్స్.. అదిరిపోయే బ్యాటరీతో నథింగ్ ఫోన్ 4B లాంచ్.. ఆర్సీబీ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ఎడిషన్ కూడా!

నథింగ్ కంపెనీ  సరికొత్త 'B-సిరీస్'లో భాగంగా నథింగ్ ఫోన్ 4B (Nothing Phone 4B)ను ఇండియాలో అధికారికంగా విడుదల చేసింది. ఎప్పటిలాగే  స్టైలిష్ లుక్‌తో పాటు భారీ ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. దీనితో పాటే క్రికెట్ అభిమానుల కోసం ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ ఇస్తూ, ఆర్సీబీ ఐపీఎల్ విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ 'నథింగ్ 4B RCB ఎడిషన్' అనే లిమిటెడ్ ఎడిషన్ ఫోన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది.

ధర ఎంత 
ఇండియాలో ఈ ఫోన్ ధరలు చూస్తే 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.34,999 (బ్యాంక్ ఆఫర్లతో కలిపి ప్రారంభ ధర రూ.29,999 లకే లభించే అవకాశం ఉంది). 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.38,999 (అన్ని ఆఫర్లతో రూ.33,699).

సేల్స్ ఎప్పటి నుంచి అంటే 
సాధారణ మోడల్స్ జూలై 14 నుండి ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో దొరుకుతాయి. అయితే, రెడ్  కలర్లో  ఉండే RCB ఎడిషన్ మాత్రం కేవలం బెంగళూరులోని నథింగ్ స్టోర్‌లో మాత్రమే 'first come first serve' అనే ప్రాతిపదికన లిమిటెడ్ సంఖ్యలో అమ్ముతారు.

నథింగ్ ఫోన్ 4B స్పెసిఫికేషన్లు & ఫీచర్లు
డిజైన్: నథింగ్ బ్రాండ్ సిగ్నేచర్ అయిన వెనుక భాగం కనిపించే ట్రాన్స్‌పరెంట్  డిజైన్, నోటిఫికేషన్ల కోసం మెరిసే గ్లిఫ్ లైట్లు, అలాగే రెడ్ కలర్  రికార్డింగ్ LED లైట్ ఇందులో ఉన్నాయి.

కలర్స్:   నలుపు , తెలుపు,  కొత్త నీలం రంగుల్లో లభిస్తుంది. RCB ఎడిషన్ మాత్రం పక్కా రెడ్ కలర్‌లో ఉంటుంది.

డిస్‌ప్లే: 6.77-అంగుళాల Full HD+ సూపర్ అమోలెడ్ స్క్రీన్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.

ప్రాసెసర్: దీనిలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్ ఇచ్చారు. దీనివల్ల ఫోన్ స్పీడ్‌గా పనిచేయడమే కాకుండా, కొత్త AI ఫీచర్లు కూడా వాడుకోవచ్చు. గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా 'వేపర్ ఛాంబర్ కూలింగ్' సిస్టమ్ కూడా పెట్టారు.

►ALSO READ | వాట్సాప్ తర్వాత టెలిగ్రామ్, సిగ్నల్‌ యాప్లకు కూడా ప్రభుత్వం షాక్ ...

కెమెరా: వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ (OIS - చేతులు ఊగినా ఫోటోలు బ్లర్ అవ్వకుండా వచ్చే ఫీచర్) కాగా, రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: నథింగ్ ఫోన్లలోనే ఇదే అతిపెద్ద బ్యాటరీ. ఇందులో 6,000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కేవలం అరగంటలోనే 50% ఛార్జింగ్ అయిపోతుంది.

సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 16 ఆధారిత 'నథింగ్ ఓఎస్ 4.1'తో ఈ ఫోన్ పనిచేస్తుంది. దీనికి 3 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ చెబుతుంది.