ధోనీ బ్యాటింగ్ కు ఆనంద్ మహీంద్రా ఫిదా

ధోనీ బ్యాటింగ్ కు ఆనంద్ మహీంద్రా ఫిదా

ఢిల్లీ :  ధోనీని సూపర్​ హీరోగా అభివర్ణించాడు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.  ఇటీవల  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. లక్నోతో ఆడిన మ్యాచ్ లో రెండు బంతుల్లో  రెండు సిక్సర్లు కొట్టి మూడో బంతికి అవుట్​ అయ్యాడు.  ఇదంతా 20వ ఓవర్లో జరిగింది.

ఈ మ్యాచ్​లో ధోనీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అతడికి యూనిఫామ్ కు సూపర్ మ్యాన్ మాదిరిగా రెక్కులను ఏర్పాటు చేయాలంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి సూచించారు ఆనంద్ మహీంద్రా. అంతేనా ధోనీకి ప్రత్యేక యూనిఫామ్ డిజైన్లు సూచించాలని అభిమానులకు పిలుపునిచ్చారు. వాటిలో మంచి డిజైన్ ను ధోనీ యూనిఫామ్ కోసం సీఎస్కే తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ఆనంద్ మహీంద్ర పిలుపుతో  నెటిజన్లు పలువురు తమదైన స్టైల్ సూపర్ హీరో క్యాస్ట్యూమ్ డిజైన్లను ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు.

https://twitter.com/anandmahindra/status/1642932900734861312